లాక్‌డౌన్‌: ‘కరోనాపై పోరాడేందుకు సహకరించండి’

ముంబై: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ అతిచిన్న మహిళ జ్యోతి అమ్గే మంగళవారం నాగపూర్‌ పోలీసులకు మద్దతుగా నిలిచారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్‌డౌన్‌ అ‍మలును ప్రజలు తప్పనిసరిగా పాటించి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో కలిసి నాగపూర్‌ సమీపంలోని ఇతర ప్రాంతాలలో అవగాహన చర్యలు చేపట్టారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు ఇంట్లోని ఉండి సహకరించాలని. అదే విధంగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా నిలవాలి’ అంటూ సందేశాన్నిచ్చారు. (శభాష్‌ పోలీస్‌)