యూట్యూబ్ సెన్సేషన్ డించక్ పూజా గుర్తుందా? అంత ఈజీగా మరిచిపోయే గొంతా? ఆమె తన గళం విప్పి దానికి పాదాలు కదిపి డ్యాన్స్ చేసిందంటే ప్రపంచమే గడగడలాడిపోతుంది. కర్ణకఠోరమైన గొంతుతో, భయంకరమైన డ్యాన్స్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయింది. తాజాగా ఆమె దృష్టి అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న కరోనా వైరస్‌పై పడింది. ఇంకేముందీ.. దానిపై ఓ పాట కట్టి.. కొంతమందికి డాక్టర్ల గెటప్ వేయించి డ్యాన్స్ చేసింది(ప్రయత్నించిందంటే బాగుంటుందేమో). ఈ వీడియోలో ముందుగా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. చేతులు శుభ్రం చేసుకోవడం, ఎవరినీ తాకకపోవడం, సామాజిక ఎడం పాటించడం, అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇంట్లోనే ఉండటం వంటి నాలుగు సూత్రాలు పాటించి దాని వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. (ఆమె డ్యాన్స్ చూస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది)
కరోనాను టార్గెట్ చేసిన డించక్ పూజా