టెకీలపై మహమ్మారి ఎఫెక్ట్‌..

బెంగళూర్‌ : కోవిడ్‌-19 ప్రభావంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ ఉద్యోగుల ఆశలపైనా ఈ మహమ్మారి నీళ్లు చల్లింది. కరోనా వైరస్‌ భయాలతో పలు ఐటీ కంపెనీల సేవలు మందగించడంతో స్లోడౌన్‌ను అధిగమించేందుకు ఆయా కంపెనీలు వేతన పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్‌లోనూ కోతలు పెట్టవచ్చని భావిస్తున్నారు. పదేళ్ల కిందట అమెరికా ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులే ఐటీ రంగంలో పునరావృతమవుతాయనే ఆందోళన నెలకొంది. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు వంటి ప్రోత్సాహకాలన్నీ ఇప్పుడు నిలిచిపోయాయని టెక్‌ మహీంద్ర సీఈవో సీపీ గుర్నానీ ఓ వార్తాసంస్థతో వెల్లడించారు. ప్రజలను సురక్షితంగా ఉంచడంపైనా ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.